Cholesterol : రోజూ వీటిని 2 స్పూన్లు తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

August 19, 2023 8:11 PM

Cholesterol : ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నష్టాలు ఉండవు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటే పలు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్ని తీసుకోవడం వలన మనం అనేక లాభాల‌ని పొందవచ్చు.

నువ్వుల్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులతో రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. నువ్వుల్ని తీసుకోవడం వలన ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. నువ్వులు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. విటమిన్ ఈ, అసంతృప్త‌ కొవ్వులు అలానే ఫైబర్ కూడా నువ్వుల్లో ఉంటాయి. రక్తపోటు చికిత్సకి కూడా నువ్వులు సహాయం చేస్తాయి.

take these daily to reduce Cholesterol
Cholesterol

రోజు రెండు టీ స్పూన్ల‌ నువ్వులు తీసుకుంటే, చాలా రకాల ప్రయోజనాలని పొందొచ్చు. అధ్యయనం ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, నువ్వులు చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. నల్ల నువ్వుల ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అని తెలుస్తోంది.

నువ్వుల నూనె గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. రోజు రెండు, మూడు టీ స్పూన్ల‌ నువ్వుల గింజల్ని తీసుకుంటే కొవ్వుల‌ని నియంత్రించొచ్చు. నీటిలో కరగని వివిధ సేంద్రియ సమ్మేళనాలలో కొవ్వులు కూడా ఒకటి. నువ్వుల నూనె లో కరిగే ఫైబర్ ఉంటుంది. రక్తంలోని కొవ్వుని శోషించకుండా, నిరోధించడం వలన రక్తంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెర తక్కువ ఉంటాయి. కాబట్టి, నువ్వుల్ని తీసుకుంటే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now