Lord Shiva : శివుడికి వేటితో అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

August 18, 2023 10:13 PM

Lord Shiva : చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడిని ఆరాధించడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే శివుడు పొంగిపోతాడు. సంతోష పడతాడు. శివుడిని రోజూ ఆరాధిస్తారు. ముఖ్యంగా శివరాత్రి నాడు శివుడిని కచ్చితంగా ఆరాధిస్తారు. అభిషేకం చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. పైగా జీవితానికి పట్టిన పీడ కూడా పోతుంది. అయితే పరమశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరిస్తే దోషాలు పోతాయి.

ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి. శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. చాలా మంది ఏ ద్రవంతో అభిషేకించినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు చెప్పినట్లు, ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది. ఇక మరి వేటితో అభిషేకం చేస్తే, ఎలాంటి ఫలితం కనబడుతుంది అనేది చూద్దాం. గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వలన నష్టపోయిన వాటిని తిరిగి పొందడానికి అవుతుంది.

Lord Shiva different types of results for abhishekam
Lord Shiva

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. పెరుగుతో కనుక అభిషేకం చేస్తే బలము, ఆరోగ్యము, యశస్సు ఉంటాయి. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. మారేడు బిల్వ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.

తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగుతుంది. పుష్పోదకముతో అభిషేకం చేస్తే భూ లాభము కలుగుతుంది. కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. రుద్రాక్ష జలముతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. భస్మాభిషేకంతో మహా పాపాలు పోతాయి. బంగారం నీటితో చేస్తే దరిద్రం పోతుంది. నీటితో చేస్తే నష్టమైనవి తిరిగి పొందడానికి అవుతుంది. ఇలా ఈ విధంగా అభిషేకం చేస్తే ఇలాంటి ఫలితాలు కనబడతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now