Money : ఈ త‌ప్పులు చేస్తే మీరు ఎప్ప‌టికీ ధ‌న‌వంతులు అవ్వ‌లేరు..!

August 13, 2023 12:53 PM

Money : కొన్ని రకాల చెడు అలవాట్లు ఉండడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే, కొన్ని రకాల చెడు అలవాట్ల వలన ధనికులు అవ్వలేరు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో విలువ కూడా ఉండడం లేదు. అయిన వాళ్లు కూడా డబ్బులు లేకపోతే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. అయితే, మనం సంపద, శ్రేయస్సుని సాధించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం.

చిన్న చిన్న పొరపాట్లే, ఆర్థిక స్థితిని మార్చేస్తాయి. అయితే, కొన్ని తప్పులు చేయకుండా వాటిని మీరు అనుసరించడం వలన ధనవంతులు అయిపోవచ్చు. ధనానికి లోటు ఉండదు. ఆర్థిక బాధల నుండి బయట పడొచ్చు. క్రమం తప్పకుండా వాష్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోండి. క్రమం తప్పకుండా వాష్ రూమ్ ని శుభ్రం చేయడం వలన నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉండదు. ఎప్పటికప్పుడు మురికి అంతటిని తొలగించుకుని, శుభ్రంగా ఉంచుకుంటే, లక్ష్మీ దేవి ఇంటికి వస్తుంది.

doing these mistakes will not get Money
Money

ఇల్లు శుభ్రంగా లేకపోయినా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్లేట్ లో ఆహారాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేయడం వలన కూడా మీరు ధనవంతులు అవ్వలేరు. అదే విధంగా తిన్న తర్వాత ప్లేట్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే శని, చంద్రుడి యొక్క దుష్ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా మీరు మీ మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

మంచం కింద చెప్పులు వంటి వాటిని ఉంచకూడదు. రాత్రిపూట నిద్రపోయే ముందు బెడ్‌ సరిగ్గా వేసుకోవాలి. తప్పుడు ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. అది దురదృష్టాన్ని కలిగిస్తుంది. ధనాన్ని రాకుండా చేస్తుంది. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవడం వంటివి కూడా మంచివి కావు. ఇటువంటి అలవాట్లకి దూరంగా ఉంటే, కచ్చితంగా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ధనవంతులు అవ్వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now