Dishti : మీపై ఏడిచే వారి దిష్టి పోవాలంటే.. ఇలా చేయండి..!

August 10, 2023 5:13 PM

Dishti : ఒకరిని చూసి ఇంకొకరు ఏడవడం సహజం. ఒకరు అభివృద్ధి చెందుతున్నా, ఒకరు పైకి వస్తున్నా ఇంకొకరు సహించలేక ఏడుస్తూ ఉంటారు. మీ మీద ఏడిచే వాళ్ళ దిష్టి పోవాలంటే, ఈ విధంగా ఆచరించడం మంచిది. ఇలా కనుక పాటించారంటే, మీపై ఏడిచే వారి దిష్టి పోతుంది. మరి ఇక దిష్టి పోవాలంటే, ఏం చేయాలి..?, ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది.

నిద్రించే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలను పెట్టుకుని, ఉదయాన్నే వాటిని బయటపడేస్తే, క‌చ్చితంగా దిష్టి మొత్తం పోతుంది. దిష్టి పోవాలంటే నల్లని తాడుని చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఘోరమైన నరదిష్టి తొలగిపోతుంది. ఒక తెల్లటి కాగితం మీద, శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాసి, ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది.

tips to follow to get rid of Dishti
Dishti

నరదిష్టి మొత్తం తొలగిపోయి, ఏ బాధ కూడా ఉండకుండా ఉండాలంటే, ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకి తిప్పి, ఆ ఉప్పును బయట పడేస్తే దిష్టి మొత్తం పోతుంది. బూడిద గుమ్మడికాయని మూడుసార్లు కుడివైపు, మూడుసార్లు ఎడమ వైపు గుండ్రంగా తిప్పి, ఎవరూ లేని చోట లేదంటే నీటిలో కానీ విడిచి పెట్టేయండి. ఇలా చేయడం వలన కూడా దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలని మీరు ఎదుర్కొంటున్నట్లయితే, అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరని, గాజులని ఇవ్వండి. వెంటనే దిష్టి మొత్తం తొలగిపోతుంది. బాధలనుండి బయటకి వచ్చేయవ‌చ్చు.

నరదిష్టి కారణంగా, అనారోగ్యం పాలైన వాళ్ళు హనుమాన్ చాలీసాని తొమ్మిది సార్లు పారాయణం చేసి, హనుమంతుడికి మూడు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే, ఆ బాధ నుండి గట్టెక్కొచ్చు. ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చూసారు కదా నర దిష్టి పోవాలంటే ఎలాంటి పనులు చేయాలి అనేది. మరి ఈ విధంగా ఈ సారి అనుసరించి, ఏ బాధలు లేకుండా హాయిగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment