ఉసిరితో పాటు తేనెను కలిపి తీసుకుంటే.. డయాబెటిస్ మాయమైనట్లే!

July 7, 2021 9:33 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే డయాబెటిస్తో బాధపడే వారు ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు.గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉసిరిని మన ఆహారంలో భాగంగా తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చు. కంటి శుక్లాలతో బాధపడేవారు, కంటి చూపును మెరుగు పరుచుకోవాలనుకొనే వారు తరచూ ఉసిరి తీసుకోవడం వల్ల అద్భుతమైన కంటి చూపును పొందవచ్చు.

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఉసిరి రసంలోకి టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.అయితే అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు తేనెకు బదులుగా చక్కెరను లేదంటే ఒట్టి నీటిలో ఉసిరి పొడిని కలుపుకొని తాగడం వల్ల మధుమేహాన్ని మాత్రమే కాకుండా ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.ఉసిరి కేవలం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా కీలకపాత్ర పోషిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now