Kubera Lakshmi Pooja : ఇలా చేస్తే.. కుబేర కటాక్షం కలిగి.. వద్దన్నా డబ్బే డబ్బు..!

August 5, 2023 5:53 PM

Kubera Lakshmi Pooja : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని, ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించాలని అనుకుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాయి. అలానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, దరిద్రానికి స్వాగతం పలికినట్లు అవుతుంది. అయితే కుబేర కొటాక్షం కోసం, ఇటువంటి పనులు చేయడం మంచిది. ఇలాంటి పనులు చేయడం వలన కుబేర కటాక్షం కలుగుతుంది.

కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే, అపారమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కమల పువ్వులతో పూజ చేయడం మంచిది. అలానే ఓం కుబేరాయ నమః అనే నామాన్ని 41 రోజుల పాటు 18 సార్లు జపించి కుబేరుడికి ధూప, దీప, నైవేద్యాలని సమర్పిస్తే మన జీవితంలో గొప్ప భోగాలు, సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఇలా కూడా మీరు 41 రోజుల పాటించి కుబేరుని అనుగ్రహాన్ని పొందొచ్చు.

Kubera Lakshmi Pooja do like this for money
Kubera Lakshmi Pooja

కుబేరుడు శివ భక్తుడు. కాబట్టి శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి నమస్కారం చేసుకున్నట్లయితే, సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు. ధనం వస్తుంది. ఇబ్బందులు ఉండవు. ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు. కాబట్టి కుబేరుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని వ్యాపార ప్రదేశంలో పెట్టి, ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటే మంచిది.

అదేవిధంగా కుబేరుడికి, లక్ష్మీదేవికి కలిపి లక్ష్మీ కుబేర పూజ చేస్తే కూడా కుబేరుని అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సమస్యలు ఉండవు. కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డూలు, సీతాఫలం పండ్లు నైవేద్యంగా పెడితే కుబేరుడికి ప్రీతి కలిగి, కష్టాల నుండి మిమ్మల్ని దూరం చేయగలడు. కుబేరుడికి ధన త్రయోదశి రోజున పూజ చేస్తే, మీ ఇల్లు సిరిసంపదలతో వర్ధిల్లుతుంది. చూశారు కదా కుబేర కటాక్షం కోసం ఎటువంటి పనులు చేస్తే మంచిదో, ఎలా కుబేరుని అనుగ్రహాన్ని పొంది ధనవంతులు అవ్వచ్చు అనేది. మరి ఇక వీటిని పాటించి హాయిగా వుండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now