Diabetes : షుగ‌ర్‌ను నియంత్రించే చిట్కాలు.. వీటిని పాటిస్తే చాలు..!

July 27, 2023 3:11 PM

Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ ఉన్నట్లయితే, ఈ చిట్కాలని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక చేశారంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అన్నం కానీ బియ్యం ఉత్పత్తులని కానీ తినడం మానుకుంటే డయాబెటిస్ నుండి త్వరగా బయటపడవచ్చు. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. గోధుమలని ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

రాగి జొన్న లేదంటే ఇతర మిల్లెట్స్ ని తీసుకుంటూ ఉండండి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కలబంద, వేప గింజల పొడి, మెంతులు ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. వేరుశెనగ, జీడిపప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, కొబ్బరి వంటివి తీసుకోవద్దు.

follow these tips to control Diabetes
Diabetes

బొప్పాయి పండు, జామ, నేరేడు పండ్లను తినండి. ఆరు నుండి 8 గంటల వ్యవధిలో ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడిని తినకండి. ఇలా షుగర్ తో బాధపడేవాళ్లు వీటిని పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటే ఎలాంటి ఇతర సమస్యలు కూడా మీకు కలగవు. అధిక బరువుతో ఉండేవాళ్లు బరువును తగ్గించుకోవడం మంచిది.

లేదంటే డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చిస్తే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను, బాగా తియ్యటి పదార్థాలని అధికంగా తీసుకోవద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now