Health Tips : ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే.. ఇక డాక్ట‌ర్‌తో అవస‌రం రాదు..!

July 27, 2023 1:00 PM

Health Tips : ప్రతి రోజూ వీటిని పాటించారంటే, మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలు ఇవి, ప్రతిరోజు ఉదయం 4:30 కి నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది. లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు నెమ్మదిగా కూర్చుని తాగాలి. ఐస్ క్రీమ్ ని అసలు తినకూడదు. ఫ్రిజ్ లో నుండి తీసినవి గంట తర్వాత మాత్రమే తినాలి. ఫ్రిజ్‌లో నుండి తీసిన ఆహార పదార్థాలను వెంటనే తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.

కూల్ డ్రింక్స్ ని అసలు తాగకూడదు. వండిన ఆహారాన్ని వేడిగా 40 నిమిషాల్లోగా తినేయాలి. భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో ఐదు నుండి పది నిమిషాల పాటు ఉండాలి. ఉదయాన్నే టిఫిన్ ని మీరు ఎనిమిదిన్నర లోపు తినేయాలి. టిఫిన్ తో పాటుగా పండ్ల రసం తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది. టిఫిన్ తిన్న తర్వాత తప్పకుండా పనులు చేసుకోవాలి.

follow these Health Tips to keep away from doctor
Health Tips

మధ్యాహ్నంలోగా మంచి నీళ్లు రెండు నుండి మూడు గ్లాసుల వరకు తాగాలి. మంచి నీళ్లు భోజనానికి 40 నిమిషాల ముందే తాగేయాలి. భోజనాన్ని కిందే కూర్చుని తీసుకోవాలి. ఆహారం బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వేసుకుంటే తిన్నది బాగా జీర్ణ‌మ‌వుతుంది. పైగా ఇతర లాభాలు కూడా పొందొచ్చు.

భోజనం తర్వాత మజ్జిగ తాగాలి. భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం భోజనం సూర్యాస్తమయం లోపు తినేయాలి. రాత్రి తక్కువ తినాలి. 9 లేదా 10 గంటలకి నిద్రపోవాలి. పంచదార, మైదా, ఉప్పు అసలు తీసుకోకూడదు. విదేశీ ఆహారాన్ని కొనుగోలు చేయకూడదు. టీ, కాఫీ ఎప్పుడూ తాగకూడదు. జూన్ నుండి సెప్టెంబర్ లో రాగి పాత్రలో వేసిన నీళ్లు తాగాలి. మార్చి నుండి జూన్ వరకు మట్టి పాత్రలో ఉంచిన నీళ్లు తాగాలి. ఇలా ఈ ఆరోగ్య సూత్రాలని మీరు పాటిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now