Lord Shiva : శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లని చెయ్యకండి..!

July 13, 2023 10:25 AM

Lord Shiva : చాలామంది శివుడిని పూజిస్తూ ఉంటారు. శివుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పులను కనుక చేశారంటే, అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. శివుడిని పూజించేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. భక్తుల కోరికల్ని తేలికగా శివుడు నెరవేరుస్తాడు. భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే, శివుడు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 3 ఆకులతో కూడిన బిల్వపత్రాన్ని శివుడికి క‌చ్చితంగా సోమవారం నాడు సమర్పించాలి.

శివుడికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి. ఈ మూడు ఆకులు శివుడి మూడు కళ్ళకి చిహ్నం. అలానే త్రిశూలానికి కూడా సంకేతం. బిల్వపత్రాలతో శివుడిని కొలిస్తే గత మూడు జన్మల పాపాలని శివుడు తొలగిస్తాడని అంటారు. అయితే బిల్వపత్రాన్ని సోమవారం నాడు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి నాడు, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయ‌కూడదు. బిల్వపత్రాలని శివుడికి పెట్టినప్పుడు పాడైన లేదా మురిగిన‌ ఆకుల్ని పెట్టకూడదు. బిల్వపత్రంతో శివుడిని పూజించేటప్పుడు ఒకసారి ఆకుల్ని కడిగి ఆ తర్వాత శివుడికి సమర్పించాలి.

Lord Shiva pooja rules to follow do not make these mistakes
Lord Shiva

కొబ్బరినీళ్ళని మాత్రం శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధాన్ని మాత్రమే పెట్టాలి. కుంకుమ సమర్పించడం వలన శివుడికి చల్లదనాన్ని ఇచ్చే బదులు వేడిని కలిగిస్తుంది. శివుడికి ఎటువంటి పండ్లని అయినా కూడా పెట్టొచ్చు. వెలగపండు మాత్రం శివుడికి ఎంతో ఇష్టం. శివుడికి పూలు పెట్టేటప్పుడు సంపంగి పూలని పెట్టకండి.

ఏ దేవుడినైనా పూజించే ముందు కచ్చితంగా వినాయకుడిని పూజించాలి. అలానే శివుడిని పూజించేటప్పుడు కూడా వినాయకుడిని ఆరాధించడం మర్చిపోకండి. శివపురాణం ప్రకారం తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. శివుడిని పూజించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. శివుడిని పూజించేటప్పుడు క‌చ్చితంగా ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పూజ చేయాలి. చూశారు కదా ఎలా శివుడిని ఆరాదించాలో. మరి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now