Durga Devi : అమ్మ‌వారికి ఎంతో ఇష్ట‌మైన నైవేద్యాలు ఇవే.. వీటిని చేసి పెడితే అనుకున్న‌ది జ‌రుగుతుంది..!

July 10, 2023 12:38 PM

Durga Devi : చాలామంది ప్రతి రోజూ లలితా సహస్రనామాలను చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గురించి ఉన్నాయి. మరి వాటిని తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీతమానస అని ఉంటుంది. గుడ అంటే బెల్లం. అన్నం అంటే బియ్యాన్ని వండడం. బియ్యం, బెల్లంతో చేసే వంటకం. పరమాన్నం అన్నమాట. అమ్మవారికి ఇది ఎంతో ఇష్టం.

స్నిగ్దౌదన ప్రియా.. స్నిగ్ద అంటే తెలుపు. ఓదనము అంటే అన్నము. అంటే పసుపు కలిపినది. తెల్లని అన్నం అన్నమాట. తెల్లగా ఉంటుంది కనుక కొబ్బరి అన్నం కూడా కావచ్చు. దీన్ని తయారు చేసి కూడా అమ్మవారికి పెట్టొచ్చు. పాయసాన్నప్రియ.. పాలు, బియ్యంతో చేసే ఒక వంటకం అన్నమాట. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. మధుప్రీతా అంటే.. మధు అంటే తేనె, ప్రీత అంటే ఇష్టమైనది. తేనెతో చేసిన పదార్థాలని మనం చెప్పచ్చు. తేనె గారెలు అంటే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.

Durga Devi likes these foods as naivedyam
Durga Devi

దద్ధ్యన్నాసక్తి హృదయా.. పెరుగు అన్నం. దద్దోజనం. సర్వోదనప్రీతచిత్తా అంటే కదంబం. దీనిని కాయగూరలు, బియ్యంతో చేస్తారు. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. హరిద్రానైక రసిక.. హరిద్రము అంటే పసుపు. అలానే అన్నం. మన పరిభాషలో పులిహోర. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.

ముగ్దౌదనాసక్త హృదయ.. అంటే పెసల‌తో చేసిన అన్నం. ఆసక్తి అంటే అభిరుచి కలిగిన. హృదయము అంటే మనసు కలిగినది. పెసలతో వండిన అన్నం. పులగమని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే వీటిని నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజించి, తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వంటకాలని నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే ఇలా లలితా సహస్రంలో నైవేద్యం గురించి ఉన్నట్లు చాలామందికి తెలియదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now