నేడే యోగిని ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే ?

July 5, 2021 12:05 PM

మన హిందూ ఆచారాల ప్రకారం సంవత్సరంలో వచ్చే ఏకాదశిలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలోనే జ్యేష్ట మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి మరింత ప్రత్యేకమని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ యోగిని ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఏకాదశి రోజు విష్ణు దేవుడికి ఏ విధంగా పూజ చేయాలి… పూజకు సరైన సమయం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి 2021 జూలై 5వ తేదీన వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి ఉపవాసంతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల సర్వ పాపాలు, సర్వరోగాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. యోగిని ఏకాదశి రోజు కఠిన ఉపవాసం తో స్వామివారికి పూజ చేయడంవల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్న దానం చేసిన పుణ్యం లభిస్తుంది.

ఎంతో పవిత్రమైన ఈ రోజు ఉదయమే స్నానమాచరించి కొత్త బట్టలను ధరించి, పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రత్యేకమైన పువ్వులతో అలంకరించాలి. అదేవిధంగా స్వామి వారి విగ్రహం ముందు ఐదు రకాల పండ్లు, తులసి మాల, పసుపు, కుంకుమలను సమర్పించి పూజ చేయాలి. ఈ విధంగా విష్ణు దేవుడికి పూజ చేయడానికి ఈరోజు ఉదయం 5:29 నుంచి 8:16 వరకు స్వామి వారిని పూజిస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రోజు రాత్రి 10:30 వరకు మంచి రోజు అని పండితులు చెబుతున్నారు. ఉదయం స్వామివారికి పూజ చేసిన విధంగా సాయంత్రం కూడా పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని పురోహితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now