ఇలా చేస్తే.. కటిక పేదరికం నుండి కూడా బయట పడచ్చు.. లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

July 4, 2023 8:58 PM

తరచూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. అంతా బాగుంది అన్నప్పుడు, ఏదో ఒక ఇబ్బంది రావడం.. లేకపోతే సమస్యలు వలన ఇబ్బంది పడడం ఇలా జరుగుతుంటాయి. కొంతమంది ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కటిక పేదరికంలో మునిగిపోతూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడినా కూడా అసలు డబ్బే నిలువదు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటన్నిటికీ పరిహారాలనే చూడాల్సిందే.

ఆర్థిక బాధలతో సతమతమయ్యే వాళ్ళు, శుక్రవారం నాడు చీమలకి గుప్పెడు పంచదారని వేయండి. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. అప్పుల బాధలు ఉంటే శనివారం నువ్వులు నూనెతో దీపాన్ని వెలిగించండి. అప్పుడు ఆ బాధల నుండి బయటపడడానికే అవుతుంది. అదే ఒకవేళ గ్రహదోషాలు ఉంటే, ఆదివారం సూర్య దేవుడిని పూజించండి. 9 అరటి పండ్లను సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి.

follow these remedies to get rid of poverty

వాస్తు దోషాలు ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి, మూడు బిల్వపత్రాలని సమర్పించండి. అదే జాతక దోషాలు ఉంటే శనివారం ఎర్రటి గుడ్డలో 11 రూపాయలని, పసుపు కొమ్ములను వేసి ముడుపు కట్టండి. అదే తీవ్రమైన శత్రుభాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఆదివారం, శుక్రవారం దుర్గాదేవిని పూజించండి. దుర్గా దేవికి ఎర్రటి గాజులు, ఎర్రటి చీరని సమర్పించాలి.

ఉద్యోగం లేక ఇబ్బంది పడేవాళ్లు 8 సోమవారాలు పంచామృతాలతో స్పటిక లింగమును అభిషేకించి, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి లేనట్లయితే రాగి పాత్రలో పసుపు నీళ్లు వేసి 108 సార్లు ‘శ్రీ ధనలక్ష్మి నమః’ అని జపిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇలా ఈ పరిహారాలతో కష్టాల నుండి గట్టెక్కచ్చు. చక్కగా సంతోషంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now