Lord Venkateshwara : శ‌నివారం అంటే వెంక‌టేశ్వ‌ర స్వామికి ఎందుకంత ఇష్టం..? ఆ వారంకు ఎందుకంత ప్ర‌త్యేక‌త‌..?

June 30, 2023 7:47 PM

Lord Venkateshwara : శనివారం నాడు కచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. ఆదివారం సూర్యుడిని, సోమవారం నాడు శివుడుని ఎలా అయితే పూజిస్తామో.. అలా శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటాము. ఇలా ఒక్కో రోజూ ఒక్కో దేవుడిని పూజించడం జరుగుతుంది. అయితే ఇలా దేవుడికి కేటాయించిన రోజు నాడు ప్రత్యేకించి భగవంతుడిని ఆరాధించాలి.

శనివారం నాడు శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు ప్రత్యేకం..? ఆ రోజు ఏడుకొండల వారిని ఎందుకు పూజ చేయాలి..? ఈ విషయానికి వచ్చేద్దాం. కలియుగ అత్యంత శక్తివంతమైన దైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శనం చేసుకోవాలని భావిస్తారు.

Lord Venkateshwara why he likes satur day very much
Lord Venkateshwara

శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వక్షస్థలంపై నిలిపిన రోజు శనివారమే.

వెంకటేశ్వర స్వామి వారిని పూజించే వారిని శని పీడించనని వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేశాడు. అది కూడా శనివారం నాడే. శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం. వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి శనివారం నాడే ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి వారు ఆలయ ప్రవేశాన్ని శనివారం నాడు చేశారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. అందుకే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now