Lizards : ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే ఐదే నిమిషాల్లో పారిపోతాయి..!

June 21, 2023 6:40 PM

Lizards : చాలా మంది ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి. బల్లులు ఎక్కువగా ఇంట్లో ఉంటే ఎంతో చికాకుగా ఉంటుంది. కాళ్ళ కింద పడిపోతాయేమో.. వంటల్లో పడిపోతాయేమో అని భయం వేస్తుంది. బల్లుల బాధ నుండి మీరు కూడా బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే అయిదే నిమిషాల్లో బల్లలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి చాలా మంది ఇళ్లల్లో బల్లులు బెడద ఉంటుంది బల్లుల బాధ నుండి బయట పడడానికి అనేక రకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు.

అయినా కుదరకపోవచ్చు మీరు కూడా మంచి టిప్ కోసం చూస్తున్నట్లయితే ఇలా పాటించండి. నిజానికి బల్లి కనబడితే మంచిదే మనకి ఏమీ ఇబ్బందులు కలగవు. ఇంకా బల్లి కనబడితే మంచే జరుగుతుంది కానీ అలా అని ఇళ్లల్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది.

if you have Lizards in your home then follow these tips
Lizards

బల్లుల బాధలు లేకుండా ఉండాలంటే ఇది వరకు గుడ్డు సోన తీసేసిన తర్వాత గుడ్డు పెంకుని గోడలకు మేకులు కొట్టి వాటిని పెట్టేవారు ఇలా చేయడం వలన బల్లులు వచ్చేవి కావు. అలా కాకుండా ఈ సింపుల్ టిప్స్ కూడా బాగుంటుంది. బల్లులు మొదట ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయి అన్నది చూసుకోండి. దాని ప్రకారం మీరు ఈ టెక్నిక్ ని ఫాలో అయిపోవచ్చు.

ఒక బౌల్ తీసుకుని అందులో డెటాల్ వేయండి ఆ తర్వాత వాటర్ వేసి ఒక అర చెక్క నిమ్మ రసాన్ని వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకుని తురుముకుని ఆ తురుమునంతటిని ఇందులో మిక్స్ చేసుకోండి. ఒకసారి ఈ మిశ్రమానంతటినీ కూడా వడకట్టేసుకుని లిక్విడ్ అంతటిని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోండి బల్లులు ఎక్కువగా తిరిగే చోట ఈ స్ప్రే బాటిల్ తో స్ప్రే చేస్తే సరిపోతుంది. బల్లులు అన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా పారిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now