ఈరోజు నుంచి మారిన కొత్త రూల్స్ ఇవే.. కొత్త రూల్స్ తో సామాన్యులపై అధిక భారం..

July 1, 2021 2:03 PM

జులై 1వ తేదీ కొత్త నెల ప్రారంభం కావడంతో పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ విధంగా మారిన కొత్త నిబంధనల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం ఏర్పడనుంది. ఈ విధంగా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల పలు అంశాలలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. మరి ఈరోజు నుంచి ఏ నిబంధనలు అమలులో ఉన్నాయి ఏ అంశాలు మారాయో ఇక్కడ తెలుసుకుందాం.

* ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్ డ్రా రూల్స్ ను సవరించింది. నెలకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలను పొందవచ్చు నాలుగు కంటే ఎక్కువ సార్లు డబ్బు డ్రా చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

*స్టేట్ బ్యాంక్ చెక్కు బుక్కు చార్జీలను కూడా సవరించింది. ఒక వార్షిక సంవత్సరంలో కేవలం 10 చెక్కులను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత ఉపయోగించే వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి.

*జూలై ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.

*సిండికేట్ బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు ఈ నెల నుంచి పనిచేయవు కనుక కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు తీసుకోవాల్సి ఉంటుంది.

*మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను యధావిధిగా ఉంచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now