Pomegranate Juice : ఈ జ్యూస్‌తో పురుషుల్లో శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ త‌గ్గి యవ్వ‌నంగా క‌నిపిస్తారు..!

May 15, 2023 2:07 PM

Pomegranate Juice : ప్రస్తుత త‌రుణంలో మ‌న‌కు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. చాలా మంది వివిధ రకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. అయితే సాధార‌ణంగా మ‌నకు పోష‌కాల లోపం వ‌ల్ల కూడా కొన్ని వ్యాధులు వ‌స్తుంటాయి. అందుకు గాను మ‌నం పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ వ్యాధులు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అయితే ఇలాంటి ఆహారాలు మ‌న‌కు ఇత‌ర వ్యాధుల‌ను, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాంటి ఆహారాల్లో దానిమ్మ పండ్ల జ్యూస్ కూడా ఒక‌టి. దీన్ని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

దానిమ్మ పండ్లు మ‌న‌కు దాదాపుగా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. ఈ పండును రోజుకు ఒక‌టి తిన్నా చాలు.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే రోజూ పండును తిన‌లేమ‌ని అనుకునేవారు జ్యూస్ తీసి ఒక చిన్న గ్లాస్ మోతాదులో తాగినా చాలు.. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Pomegranate Juice many wonderful benefits
Pomegranate Juice

దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ సేపు ర‌తిలో పాల్గొన‌గ‌లుగుతారు. సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. ఈ జ్యూస్‌ను తాగితే చ‌ర్మం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. న‌వ య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. అందుక‌నే సినిమా తార‌లు సైతం రోజూ దానిమ్మ పండ్ల జ్యూస్‌ను త‌ప్ప‌నిస‌రిగా తాగుతుంటారు. ఈ జ్యూస్ వ‌ల్ల శిరోజాలు సైతం ప్ర‌కాశవంతంగా మారుతాయి. ఇక దానిమ్మ పండ్ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక ఈ జ్యూస్‌ను రోజూ తాగితే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో క‌ణాల‌కు పోష‌ణ బాగా ల‌భిస్తుంది.

దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ అదుపులోకి వ‌స్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. అలాగే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ఉండ‌వు. అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా దానిమ్మ పండ్ల జ్యూస్‌తో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్‌ను తాగ‌డం మ‌రిచిపోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment