Curry Leaves Butter Milk : మ‌జ్జిగ‌ను ఇలా తీసుకోండి.. వేస‌విలో ఎంతో మేలు చేస్తుంది..!

May 11, 2023 5:01 PM

Curry Leaves Butter Milk : మజ్జిగ, కరివేపాకులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, మూడు నల్ల మిరియాలు వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర, అర అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. మిక్సీ చేశాక ఒక గ్లాస్ లో పోసి తాగాలి. ఈ మజ్జిగ తాగటం వలన ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు తాగవచ్చు. అలా కుదరని వారు కనీసం వారంలో మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీన్ని త‌యారు చేశాక ఫ్రిజ్‌లో పెట్టుకుని కూడా తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. ఇలా తాగ‌డం వల్ల వేస‌విలో ఎంతో మేలు జ‌రుగుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకుతో తయారుచేసిన మజ్జిగ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు ఈ మజ్జిగను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి వాటిని తగ్గించుకోవ‌చ్చు. మజ్జిగలో కాల్షియం, విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కరివేపాకులో ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విట‌మిన్లు సి, ఎ, బి, ఇ సమృద్ధిగా ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న‌కు పోష‌ణ లభిస్తుంది.

Curry Leaves Butter Milk take it daily in this season for benefits
Curry Leaves Butter Milk

యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండ‌డం వలన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి ఆరోగ్యం బాగుండేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండ‌డం వలన చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మంచి కంటి చూపు కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువ‌ల్ల క‌రివేపాకుల‌తో త‌యారు చేసిన మ‌జ్జిగ‌ను మ‌నం రోజూ తాగాలి. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పైగా వేస‌విలో దీన్ని తాగితే వేడి త‌గ్గుతుంది. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. దీన్ని మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో చ‌ల్ల చల్ల‌గా తాగితే మేలు జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment