Ginger Juice : ప‌ర‌గ‌డుపున రోజూ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఉండవు..!

April 26, 2023 10:39 AM

Ginger Juice : నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. ర‌క్త‌ నాళాలలో ర‌క్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుంది. అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాల‌ను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Ginger Juice on empty stomach can give many benefits
Ginger Juice

అల్లం ర‌సాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజుల‌కు బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొలగించ‌డంలో అల్లం మెరుగ్గా ప‌నిచేస్తుంది. నిత్యం అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now