Piles : పైల్స్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

April 24, 2023 3:51 PM

Piles : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగటం, మలబద్దకం సమస్య, ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది. ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది.

వామును తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాము పొడి వేసి బాగా కలపాలి. ఈ మజ్జిగను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండాలి. ఫైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి. మసాలాలు, కారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధికంగా ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.

Piles home remedy use carom seeds in this way
Piles

నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి పైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన‌ చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి పైల్స్ సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అయితే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now