Headache : త‌ల‌కు ఏ వైపు నొప్పి వ‌స్తుంది.. గ‌మ‌నించారా.. వివిధ ర‌కాల త‌ల‌నొప్పులు ఇవే..!

April 9, 2023 8:05 PM

Headache : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం అనుభవించే కొన్ని లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కనుబొమ్మల మధ్యలో లేదా నుదుటిపై వచ్చే తలనొప్పి టెన్షన్ లేదా, సైనస్‌కు సంబంధించిన తలనొప్పిగా ఉంటుంది. తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో ఏదైనా ఒక వైపు నొప్పి వస్తే దాన్ని మైగ్రేన్‌గా భావించాలి. కనుగుడ్డు చుట్టూరా వస్తే దాన్ని క్లస్టర్ తలనొప్పిగా భావిస్తారు. ఇలాంటి సందర్భంలో వికారంగా, వాంతికి వచ్చినట్టు కూడా ఉంటుంది. మెదడులో ఏవైనా ట్యూమర్లు ఉన్నా, రక్తస్రావం అవుతున్నా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి ఒకేసారి పెద్దపాటి మెరుపులా వస్తుంది. ఇది దాదాపు 60 సెకండ్ల పాటు ఉంటుంది. ఇది భరించలేనంత నొప్పిని కలిగిస్తుంది.

what type of Headache you are having it may be dangerous
Headache

కొంతమందికి వ్యాయామం చేసినా, శృంగారంలో పాల్గొన్నా తలనొప్పి వస్తుంది. ఇది సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్‌కు చెందినదే అయి ఉంటుంది. మందగించిన, అస్పష్టమైన చూపుతో వచ్చే తలనొప్పి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వస్తుంది. ఈ సందర్భంలో ఒక్కోసారి మాటలు తడబడడం, చిత్తం స్వాధీనంలో లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పైవేవీ కాకుండా తలనొప్పి తరచూ వస్తున్నా సందేహించాల్సిందే. వెంటనే వైద్యున్ని సంప్రదించి తక్షణమే చికిత్స ప్రారంభించాలి. వయస్సు 50 ఏళ్లకు పైబడిన వారిలో తలనొప్పి తరచుగా వస్తుంటే వారి మెదడులోని ధమనుల పనితీరు మందగించిందని అర్థం.

తలకు గాయమైనా ఒక్కోసారి తలనొప్పి వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో మైకంగా ఉండడంతోపాటు మానసిక ఏకాగ్రత కూడా సరిగ్గా ఉండదు. మెడ పట్టుకోవడం, జ్వరం, తలనొప్పి వంటివి మెనింజైటిస్ వంటి రుగ్మతలో సహజంగా కనిపించే లక్షణాలు. ఒకసారి తలనొప్పి వచ్చి 24 గంటల పాటు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. క్యాన్సర్‌లు ఉన్న వారిలో తలనొప్పి వస్తుంటే అది బ్రెయిన్ ట్యూమర్‌గా మారుతుందని గమనించాలి. ఇలా వివిధ ర‌కాల త‌ల‌నొప్పుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. తీవ్ర‌మైన అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌న‌మే ముందుగానే రక్షించుకున్న‌వార‌మ‌వుతాం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now