ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఇంటి వ‌ద్దే న‌గ‌దు తీసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

June 29, 2021 6:58 PM

క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే దాదాపుగా అన్ని బ్యాంకులు వీలైనంత వ‌ర‌కు అన్ని లావాదేవీల‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎస్‌బీఐ త‌న వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని అందించేందుకు ఇంటి వ‌ద్ద‌కే న‌గ‌దు తెచ్చి అందిస్తోంది. ఈ సౌక‌ర్యాన్ని ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

sbi offers cash withdraw and deposit services at home

ఎస్‌బీఐ అందిస్తున్న డోర్ డెస్ట్ డెలివ‌రీ స‌ర్వీస్ తో రోజుకు రూ.20వేల వ‌ర‌కు ఖాతాదారులు ఇంటి వ‌ద్దే న‌గ‌దు పొంద‌వ‌చ్చు. అంతే మొత్తంలో న‌గ‌దును డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల మ‌ధ్య ఈ సేవ అందుబాటులో ఉంటుంది. బ్యాంకు ప‌నిదినాల్లో మాత్ర‌మే ఈ సేవ‌ను అందిస్తారు.

ఖాతాదారులు త‌మ హోమ్ బ్రాంచ్ నుంచి మాత్ర‌మే ఇలా న‌గ‌దు పొందే సౌక‌ర్యం ఉంది. న‌గ‌దు డెలివ‌రీ స‌మ‌యంలో కేవైసీ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ స‌ర్వీస్‌కు రూ.100 + జీఎస్టీ ఫీజు చెల్లించాలి. న‌గ‌దు డిపాజిట్ చేసినా ఇంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు 1800 1111 03 అనే నంబ‌ర్‌కు కాల్ చేయ‌వ‌చ్చు. హోం బ్రాంచి నుంచి 5 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నివాసం ఉండే క‌స్ట‌మ‌ర్లు ఈ సేవ‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ తో న‌గ‌దును విత్‌డ్రా చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment