Chanakya : చాణక్య నీతి.. పురుషులు ఈ 4 ర‌హ‌స్యాల‌ను ఎప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌రాదు.. ఎందుకంటే..?

March 28, 2023 9:34 PM

Chanakya : ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతిని అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు.

అయితే చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట. ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దట. డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట. పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదట.

Chanakya niti do not tell these secrets to others
Chanakya

వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే అవతలి వ్యక్తులు వాటిపై హాస్యమాడతారు. ఆ సమస్యలపై జోక్‌లు వేసి మరింత విసుగు తెప్పిస్తారు. ఇది సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంది. ఒక వ్యక్తి తన భార్య గురించిన ఏ విషయమైనా ఇతరులతో చర్చించకూడదు. ఏ విషయాన్నయినా రహస్యంగానే ఉంచాలి. ఒక వేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుంది. భార్య గురించిన రహస్యాలను ఇతరులతో పంచుకోరాదు.

ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి. అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు తెలియజేయకూడదు. అలా చేస్తే దానిపై వారు హాస్యమాడతారు. అప్పుడు సదరు వ్యక్తుల మనోభావాలు, గొప్పతనం దెబ్బతింటాయి. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. క‌నుక ఈ ర‌హ‌స్యాల‌ను పురుషులు ఎప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now