Mango Kernel : మామిడి పండ్ల‌ను తిని పిక్క‌ల‌ను ప‌డేస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

March 27, 2023 12:42 PM

Mango Kernel : ఎండాకాలం వస్తుందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయ. ఈ మామిడిపండ్లు తియ్యగా, పుల్లగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే మనం మామిడి పళ్లను తినేటప్పుడు పైన గుజ్జును తిని దాని పిక్కని పడేస్తాం. అయితే ఆ పిక్కతో చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలిస్తే మనం వాటిని ఇక‌పై పడేయము. అయితే ఆ పిక్కను ఎలా వాడితే ఏం ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పిక్కలో ఉన్న జీడిని తీసి పొడిగా తయారుచేసుకొవాలి. ఈ పొడిలో వెన్న కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా మారుతుంది. కాంతివంతంగా ఉంటుంది. ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే టెంక పొడిలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవ నూనె కలిపి రాస్తే తెల్ల జుట్టు కాస్తా నల్లగా నిగనిగలాడుతుంది. మామిడి పిక్కలో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే జుట్టుకు పోషణ ఇవ్వడ‌మే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడ‌తాయి.

Mango Kernel benefits know how to use it
Mango Kernel

ఎవరికైనా జుట్టులో చుండ్రు సమస్య ఉంటే మామిడి పిక్కను పొడి చేసుకొని ఆ పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ గా చేసి తల మాడుకు పట్టిస్తే చుండ్రు మటుమాయం అవుతుంది. అధే విధంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ పొడిలో తేనె కలిపి ప్రతి రోజు పర‌గడుపున తాగాలి. అలా చేస్తే ఉబ్బసం, దగ్గు వంటివి దెబ్బకి మాయమవుతాయి. వేసవికాలంలో అందరికీ వేడి చేస్తుంది. ఈ వేడి తగ్గ‌డానికి కూడా ఇది పని చేస్తుంది. మామిడి టెంక పొడి, జీలకర్ర, మెంతుల పొడి మూడింటినీ సమానంగా తీసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వేడి తగ్గుతుంది. ఇలా మామిడి టెంక‌ల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment