Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయ‌వ‌చ్చో తెలుసా..?

March 26, 2023 6:06 PM

Boiled Eggs : మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ.. ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీయ‌డంలోనే అస‌లు స‌మ‌స్యంతా వ‌స్తుంటుంది. ఒక్కోసారి పొట్టు స‌రిగ్గా రాక గుడ్డు చిత‌క‌డం, అందులోని ప‌దార్థం బ‌య‌టికి రావ‌డం జ‌రుగుతుంటుంది.

అయితే ఈ స‌మ‌స్యంతా లేకుండా ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డును బాగా ఉడ‌క‌బెట్టిన త‌రువాత దాన్ని ప‌క్క‌కు ఉంచి, ఒక చిన్న‌పాటి గాజు జార్ లాంటి దాన్ని తీసుకోవాలి.

how to remove peel of Boiled Eggs very easily
Boiled Eggs

అందులో ఆ గుడ్డును వేసి ఆ జార్ మూత‌ను గ‌ట్టిగా బిగించాలి. ఇప్పుడు 4 నుంచి 5 సెకండ్ల పాటు జార్‌ను అటు ఇటు షేక్ చేయాలి. అనంత‌రం జార్ మూత తీసి గుడ్డు పొట్టు తీస్తే సుల‌భంగా వ‌స్తుంది. అంతే. ఈ చిట్కాను ట్రై చేయండి. దీంతో కోడిగుడ్ల పొట్టును సుల‌భంగా తీయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment