Sai Pallavi : సాయిప‌ల్ల‌వికి ఆమె త‌ల్లిదండ్రులు ఆ పేరును ఎందుకు పెట్టారో తెలుసా..?

February 23, 2023 7:06 PM

Sai Pallavi : తనకంటూ కొన్ని రూల్స్ ఏర్పరచుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకున్న సాయిపల్లవికి తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా సరే సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతోపాటు తన నటనతో ఫిదా చేస్తూ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే తెలుగు, తమిళ, మళ‌యాళ భాషల్లో సైతం నటిగా ఆఫర్లను సాధిస్తూ విజయాలను నమోదు చేస్తున్న సాయిపల్లవి నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పిస్తూ రౌడీ హీరోయిన్ గా మారింది.

ఇక సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మూవీ హిట్ కాగా.. విరాటపర్వం ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే శ్యామ్ సింగరాయ్ లోనూ న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేసిన సందర్భాలున్నాయి. సాయిపల్లవి తల్లి రాధ నాట్యకారిణి. తండ్రి కన్నన్‌ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు. ఆమె తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో నటించి ఆ తరువాత మీరా జాస్మిన్ కు క్లాస్ మెట్ గా నటించింది.

Sai Pallavi do you know why her parents named her like that
Sai Pallavi

అయితే స్టడీస్ పై దృష్టి పెట్టి జార్జియాలో మెడిసిన్ పూర్తిచేసి మళ‌యాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఇక‌ అల్లు అర్జున్ డ్యాన్సులంటే సాయిపల్లవికి ఇష్టం. అయితే ఫిదాలో తన డ్యాన్స్ ను అల్లు అర్జున్ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది. ఇక సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం సినిమాలు ఏవీ చేయ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now