Hyderabad Irani Chai : హైద‌రాబాద్ లో బెస్ట్ ఇరానీ చాయ్ ల‌భించే ప్రాంతాలు ఇవే..!

February 16, 2023 9:27 PM

Hyderabad Irani Chai : హైద‌రాబాద్ న‌గ‌రం అనేక చారిత్ర‌క స్థ‌లాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, వ‌స్తువుల‌కే కాదు.. ప‌లు ఆహార ప‌దార్థాల‌కు కూడా ఫేమ‌స్సే. వాటిలో చెప్పుకోద‌గిన‌వి రెండు. ఒక‌టి హైద‌రాబాద్ బిర్యానీ. రెండు ఇరానీ చాయ్‌. రెండూ భాగ్య‌న‌గ‌రంలో ఫేమ‌స్సే. బిర్యానీని ఆర‌గించేందుకు మ‌న న‌గ‌రంలో లెక్క‌లేన‌ని హోట‌ల్స్ ఉన్నాయి. కానీ కేవ‌లం కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే మ‌న‌కు అసలు సిస‌లైన హైద‌రాబాద్ బిర్యానీ ల‌భిస్తుంది. అలాగే ఇరానీ చాయ్ కూడా. దీన్ని కింద చెప్పిన ప‌లు హోట‌ల్స్‌లో ఎంజాయ్ చేసి చూడండి. ఆ త‌రువాత మీరు ఇరానీ చాయ్‌కి ఫిదా అయిపోతారు. మ‌రి హైద‌రాబాద్‌లో బెస్ట్ ఇరానీ చాయ్ ల‌భించే ఆ హోట‌ల్స్, ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

బ్లూ సీ కేఫ్, సికింద్రాబాద్‌.. సికింద్రాబాద్ వెళ్తే ఇక్క‌డి బ్లూ సీ కేఫ్‌లో ఇరానీ చాయ్ టేస్ట్ మ‌రువ‌కండి. అంత‌లా బాగుంటుంది. అలాగే నాంప‌ల్లిలో ఉన్న కేఫ్ నీలోఫ‌ర్ అండ్ బేక‌ర్స్‌ కేఫ్‌లో ఇరానీ చాయ్ తాగితే అదిరిపోయే టేస్ట్ ల‌భిస్తుంది. పాత‌బ‌స్తీలో ఉన్న షాదాబ్‌ హోట‌ల్‌లో ఒక్క సారి ఇరానీ చాయ్ టేస్ట్ చూస్తే దాన్ని మీరు విడిచిపెట్ట‌రు. బంజారాహిల్స్‌లో ఉండే లామ‌కాన్‌లోనూ మ‌న‌కు బెస్ట్ ఇరానీ చాయ్ దొరుకుతుంది. హైద‌ర్‌గూడ‌లో ఉన్న కేఫ్ బ‌హార్‌ ఇరానీ చాయ్‌కు పెట్టింది పేరు.

Hyderabad Irani Chai best places to taste it
Hyderabad Irani Chai

బంజారా హిల్స్ లోని స‌ర్వి హోట‌ల్ లో ఉండే స‌ర్వి బేక‌ర్స్‌లో ఇరానీ చాయ్ తాగి తీరాల్సిందే. అలాగే ఘ‌న్సీ బ‌జార్‌లోని హోట‌ల్ న‌యాబ్ కూడా ఇరానీ చాయ్‌కు ఫేమ‌స్సే అని చెప్ప‌వ‌చ్చు. ఇక పాత‌బ‌స్తీలోని చార్మినార్ ద‌గ్గ‌ర ఉండే నిమ్రా కేఫ్ అండ్ బేక‌రీలోనూ బెస్ట్ ఇరానీ చాయ్ ల‌భిస్తుంది. మ‌సాబ్ ట్యాంక్ వ‌ద్ద ఉన్న తైబా బేక‌రీ అండ్ కేఫ్ లో ఇరానీ చాయ్ ల‌భిస్తుంది. టోలిచౌకిలో ఉన్న రుమాన్ కేఫ్‌లోనూ మ‌న‌కు బెస్ట్ ఇరానీ చాయ్ ల‌భిస్తుంది. ఇలా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో మ‌న‌కు బెస్ట్ ఇరానీ చాయ్ ల‌భిస్తుంది. కావాలంటే ఒక్క‌సారి ట్రై చేయండి. బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now