ఫోటో వైరల్: ఆలయానికి కాపలాగా మొసలి.. చనిపోయిన తిరిగి వస్తుంది?

June 27, 2021 7:16 PM

సాధారణంగా మనం మొసలిని చూడగానే దాని క్రూరత్వం గుర్తుకు వచ్చి వెంటనే భయంతో ఆమడ దూరం పరిగెడతాము. ఒక్కసారి మొసలి చేతికి దొరికామంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతటి భయంకరమైన జంతువు ఒక ఆలయానికి కాపలాగా ఉందని విషయం తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఏమీ అనదు.. అదే విధంగా పూజారి చెప్పిన మాటను ఎంతో చక్కగా వినే ఈ మొసలి కేరళలో అనంత పద్మనాభ ఆలయంలో ఉంది.

అనంత పద్మనాభ ఆలయంలోని సరస్సులో ఉండే ఈ మొసలిని భక్తులందరూ బబియా అనే పేరుతో పిలుస్తారు. ఈ సరస్సుకు ఆనుకొని ఉన్న పద్మనాభ ఆలయానికి మొసలి కాపలాగా ఉంటుంది. ఈ మొసలి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాంసం ముట్టుకోదు, కేవలం ప్రతిరోజు ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తుంది. కొన్నిసార్లు ఈ మొసలి సరస్సు నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆలయంలో భక్తులకు ఏ మాత్రం హాని కలిగించదు. పూజారి చెప్పిన విధంగా నడుచుకోవడం దీని ప్రత్యేకత.

కథనం ప్రకారం 1945లో.. అంటే సుమారు 76 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో సంచరిస్తున్న మొసలిని చంపేశాడు. మొసలిని చంపిన కొద్ది రోజులకే ఆ సైనికుడు పాముకాటుకు గురై మరణించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైనికుడు చనిపోయిన కొన్ని రోజులకే ఈ సరస్సులో మరో మొసలి కనిపించడంతో ఇదంతా ఆ భగవంతుని కృప అని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఈ మొసలికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now