Naga Chaitanya : నాగ చైత‌న్య‌, శోభిత స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా.. వీళ్ల ప్రేమ మ్యాట‌ర్ పీక్స్ లో..?

February 15, 2023 2:07 PM

Naga Chaitanya : అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య.. సమంతను ప్రేమించి పెళ్లాడిన నాలుగేళ్లలోనే తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చైతూకి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ హీరోయిన్‌తో చైతూ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారనే విషయం అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. విడాకుల తర్వాత అటు సమంత , ఇటు నాగ చైతన్య నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ తమ తమ కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ.. వాళ్ల పర్సనల్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభిత దూళిపాళ్ల‌తో నాగ చైతన్య సీక్రెట్ ఎఫైర్ న‌డుపుతున్నాడంటూ కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

నాగ చైతన్య, శోభిత ఒక చోట జంటగా కనిపించారని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, అది ఎడిటెడ్ అనే వాదన కూడా ఉంది. శోభిత సోషల్ మీడియా పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టడం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. దీనితో చైతు, శోభిత మధ్య ప్రేమ ఉందనే వాదనకి బలం చేకూరుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చైతు, శోభిత ప్రేమ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ ప్రేమ విషయాన్ని శోభిత, చైతు ఇరు కుటుంబ సభ్యులకు తెలియ‌జేయ‌డంతో చైతు నిర్ణయాన్ని గౌరవించి శోభితతో ప్రేమకి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స‌మాచారం.

Naga Chaitanya and Sobhita Dhulipala getting ready for surprise
Naga Chaitanya

శోభితతో కలసి నటించిన అడివి శేష్ కూడా అక్కినేని ఫ్యామిలీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. ఇప్పటికైతే చైతు, శోభిత తమ రిలేషన్ ని సీక్రెట్ గానే మైంటైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కాగా, కొన్ని రోజుల క్రితం శోభిత‌కి సంబంధించిన‌ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఇవన్నీ కావాలని ఎవరో పుట్టిస్తున్న వార్తలు అని కొట్టిపారేశారు. దీంతో క్రమంగా ఈ ఇష్యూ క్లోజ్ అవుతూ వచ్చింది. ఇంతలో ఇప్పుడు మళ్ళీ ఊహించని విధంగా ఇదే టాపిక్ తెరపైకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మ‌రి దీనిపై చైతూ ఏమైన స్పందిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now