Nani : వివాదంలో నాని.. బూతు ప‌దం స‌మ‌ర్థించుకోవ‌డంతో తెగ ట్రోల్స్..

February 14, 2023 9:17 PM

Nani : నేచుర‌ల్ నాని ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చారు. కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌గా, ప్ర‌తి సినిమాకి మంచి రెస్పాన్సే వ‌స్తుంది. ఇటీవ‌ల నాని న‌టించిన చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కోడుతున్నాయి. గత చిత్రం `అంటే సుందరానికి` పెద్ద‌గా విజ‌యం పొంద‌లేక‌పోయాడు. `శ్యామ్ సింగరాయ్‌`తోనే ఓ ప్రయోగం చేయ‌గా, కొంత మేరకు సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు `దసరా`తో పూర్తిగా ట్రాన్ఫ్సమేషన్‌ చూపిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సింగరేణి బొగ్గు గనుల మధ్య సాగే కథతో వస్తున్నాడు. ఇందులో నాని పూర్తిగా తెలంగాణ కుర్రాడిగా కనిపించడంతో పాటు తెలంగాణ యాసలోనూ మాట్లాడుతున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్‌లో ఆయన తెలంగాణలోనే డైలాగ్‌లు చెప్పి మెప్పించారు. నాని వంటి క్లాస్‌ హీరో నుంచి ఇలాంటి మాస్ డైలాగ్‌ వినడం అభిమానులకి మాత్రం మంచి కిక్ ఇస్తుంది. అయితే ఇటీవ‌ల చిత్రంలోని `ఓరి వారి` అనే పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్‌ నిర్వహించ‌గా, ఇందులో మీడియా ప్రతినిధి ఒకరు `బాంఛత్‌` అనే పదాన్ని ఎలా వాడతారు, మీ సినిమా చూసే పిల్లలు దాన్ని ఉపయోగించే ప్రమాదం ఉంది కదా అని ప్రశ్నించగా, దాన్ని నాని సమర్దించుకోవడం విశేషం. అందులో తప్పు ఏమి ఉంది. అని అది జనసామాన్యంలో ఉన్న పదమే కాబ‌ట్టి సినిమా లో వాడామని సమర్ధించుకునే ప్రయత్నం చేసారు.

Nani is in controversy for his comments
Nani

అంతేకాక బూతు పదాన్ని అందరూ వాడాలని, ఆ పదాన్ని స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. సినిమాలో నాని చేసిన పాత్ర ఒక బొగ్గుగనుల్లో పని చేసే కార్మికుడిది కాబట్టి అలా మాట్లాడారంటే ఓకే కాని పిల్ల‌లు కూడా నేర్చుకోమ‌న‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్. సోదరిని ఉద్దేశించి మాట్లాడే ఒక రాయలేని తిట్టు అని నానికి తెలియదు అంటే నమ్మే విషయమేనా అని కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు కొందరు ఆయన్ని సమర్ధించినా, మరికొంత మంది మాత్రం ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం తెలియజేయడం గమనార్హం. మరి ఈ వివాదంకి నాని ఎలాంటి పులిస్టాప్ పెడ‌తాడు అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now