Tollywood Heroes : ఈ ఏడాదిలో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న తెలుగు హీరోలు ఎవ‌రో తెలుసా..?

February 14, 2023 8:08 PM

Tollywood Heroes : గ‌త ఏడాది టాలీవుడ్‌కి బాగానే క‌లిసొచ్చింది. చిన్న చిత్రాల‌తో పాటు పెద్ద చిత్రాలు కూడా మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. సినిమా హిట్ కావ‌డంతో నిర్మాత‌లు భారీ వ‌సూళ్లు ద‌క్క‌డంతో హీరోల‌కి కూడా రెమ్యున‌రేష‌న్ బాగానే ముట్ట‌జెప్పారు. ఇక 2023లోను టాలీవుడ్‌లో మంచి చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ సినిమాల‌కి మ‌న హీరోలు కూడా భారీగానే రెమ్యున‌రేషన్ అంది పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే, 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు ఎవరో చూస్తే..

మొద‌ట‌గా… ప్రభాస్ – ఒక్కో సినిమాకు రూ. 150-200 కోట్లు తీసుకంటున్నాడు. ఆది పురుష్ మరియు సలార్ మూవీల‌ని 2023లో విడుదల చేస్తూన్నారు ప్రభాస్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చర‌ణ్‌.. ఒక్కో సినిమాకు రూ. 80-100 కోట్లు తీసుకుంటున్నాడు. శంక‌ర్‌తో పాటు బుచ్చి బాబుతో సినిమాలు చేస్తున్నాడు చ‌రణ్‌. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ – రూ. 80-100 కోట్లు ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లో కొర‌టాలతో ఓ సినిమా చేయ‌నుండ‌గా, దీని త‌ర్వాత ప్రశాంత్ నీల్‌తో పాన్-ఇండియా సినిమా చేయనున్నాడు.

Tollywood Heroes here the remunerations for them in 2023
Tollywood Heroes

ఇక మహేష్ బాబు .. ఒక్కో సినిమాకు రూ. 60-75 కోట్లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్రమ్‌తో చేతులు కలిపిన మహేష్ బాబు… దీని తర్వాత మహేష్ బాబు 2024లో ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి సిద్ధం కానున్నాడు. పవన్ కళ్యాణ్ – ఒక్కో సినిమాకు రూ. 50-75 కోట్లు తీసుకుంటున్నాడు. హరి హర వీర మల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ అనే సినిమాలకు సైన్ చేశాడు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్.. ఒక్కో సినిమాకు రూ. 60-80 కోట్లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉండ‌గా, డిసెంబర్ 2023 విడుదలకు షెడ్యూల్ చేయబడింది. ఇక చిరంజీవి రెమ్యునరేషన్ – ఒక్కో సినిమాకు రూ. 50-60 కోట్లుగా ఉంది. రవితేజ – ఒక్కో సినిమాకు రూ. 30-35 కోట్లు తీసుకుంటున్న‌ట్టు టాక్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now