త‌ళుక్కున మెరిసిన ప‌వ‌న్, మ‌హేష్ బాబు వార‌సులు.. వీరిద్ద‌రి గురించే అస‌లు చ‌ర్చ‌..!

February 13, 2023 9:38 PM

సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా ఎప్ప‌టి నుండో చూస్తున్నాం. అయితే వార‌సులుగా వచ్చిన వారిలో కొంద‌రు రాణించ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం మ‌ధ్య‌లోనే డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో రాబోయే వారసుల లిస్టు అయితే పెద్దగానే ఉంది. అయితే అందులో ఎక్కువగా మాత్రం మహేష్ బాబు పవన్ వారసులపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో దాదాపు ఓకే తరహాలో క్రేజ్ ఉంద‌నే సంగ‌తి తెలిసిందే.

ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలో ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు కొన్ని గొడవలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని , అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ మధ్యలో వార్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే విధంగా ఓవర్గం వారు అనవసరపు కామెంట్స్ చేసుకుంటూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్‌గా జ‌రిగిన‌ ఫార్ములా ఈ రేసింగ్ పోటీల‌కు టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ హాజ‌ర‌య్యారు. నాగార్జున‌, రామ్‌చ‌ర‌ణ్‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌తో పాటు ప‌లువురు హీరోలు రేసింగ్ పోటీల్లో సంద‌డిచేశారు.

akira nandan and gautam krishna appeared fans happy

అయితే ఈ పోటీల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్‌, మ‌హేష్‌బాబు వార‌సుడు గౌత‌మ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. గౌతమ్ ఘట్టమనేని చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపించాడు. ఇక త‌న స్నేహితుల‌తో క‌లిసి అకీరా ఈ రేసింగ్ పోటీల‌ను తిల‌కించాడు. అత‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారాయి. క్యాప్ పెట్టుకొని స్టైలిష్‌గా అకీరా నంద‌న్ క‌నిపించాడు. వీరిద్ద‌రిని చూసిన అభిమానులు రాబోయే కాలానికి కాబోయే స్టార్స్ వీరిద్ద‌రు అంటూ నానా ర‌చ్చ చేస్తున్నారు. అంతేకాదు పోటీలు ప‌డుతూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ప‌వన్, మ‌హేష్‌ల కిడ్స్ ఎప్పుడు ఇండ‌స్ట్రీకి వ‌స్తారో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now