Vidadala Rajini : సినిమాల్లోకి ఏపీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.. ఆశ్చ‌ర్య‌పోతున్న సినీ ప్రియులు..!

February 11, 2023 8:33 AM

Vidadala Rajini : సినిమాల్లోకి రాజ‌కీయ నాయ‌కులు ఎంట్రీ ఇవ్వ‌డం అనేది కొత్త కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. 2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజిని.. 2018లో వైసీపీలో చేరింది. ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఆమెకు గత క్యాబినెట్ విస్తరణ సంద‌ర్భంగా మంత్రి పదవి కూడా వరించింది.

ఇప్పుడు విడ‌ద‌ల ర‌జిని ఓ నిర్మాణ సంస్థ‌ను స్థాపించార‌ట‌. హైద‌రాబాద్‌లో క‌థా చ‌ర్చ‌లు చేయ‌టానికి ఆఫీసుని కూడా తీసుకున్నార‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ఆమె చేయ‌బోయే తొలి సినిమాకి కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. దర్శకుడు, హీరో ఎవరనే అంశాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రాబోతుండ‌గా, భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీలో మంత్రిగా ఉన్న ఆర్.కే రోజా సినిమా రంగంలో ఉండ‌గా… ఇప్పుడు మంత్రి విడ‌ద‌ల ర‌జనీ కూడా ఎంట‌ర‌య్యారు.

Vidadala Rajini making entry into tollywood
Vidadala Rajini

అయితే… ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌న్న చ‌ర్చ సాగుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయాల‌ను కాద‌ని, హైదరాబాద్ కేంద్రంగా సినిమా రంగంపై ఫోక‌స్ చేస్తుండ‌టం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌న్న విశ్లేఫ‌ణ‌లు సాగుతున్న నేప‌థ్యంలో విడ‌ద‌ల ర‌జ‌నీ వేస్తున్న అడుగులు దేనికి సంకేత‌మో అర్థం చేసుకోవాలంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై విడ‌ద‌ల ర‌జిని ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now