Kirak RP : అమెరికాలో కూడా చేప‌ల పులుసు పెడ‌తా.. కిరాక్ ఆర్‌పీ..

February 10, 2023 3:36 PM

Kirak RP : జ‌బ‌ర్ధ‌స్త్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి బిజినెస్ చేయాల‌ని అనుకున్న కిరాక్ ఆర్పీ ఏ ముహూర్తాన‌ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించాడో కానీ గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్‌ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. మొదట కూకట్‌ పల్లిలో ప్రారంభమైన ఈ కర్రీ సెంటర్‌కు నగరవాసుల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. కస్టమర్లను కంట్రోల్‌ చేయడానికి కర్రీ పాయింట్‌లో ఏకంగా బౌన్సర్లను నియమించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ట్రాఫిక్‌ సమస్యలు కూడా తలెత్తడంతో ప్రారంభించిన కొన్ని రోజులకే చేపల పులుసు సెంటర్‌ క్లోజ్ చేశారు

నెల్లూరు వెళ్లి అక్కడి మహిళలను, కొత్త చెఫ్‌ల‌ని తీసుకొచ్చి కొత్త ఉత్సాహంతో మళ్లీ కర్రీపాయింట్‌ను ఓపెన్‌ చేశాడు. బిజినెస్‌లో బాగా లాభాలు వచ్చాయేయో తాజాగా మణికొండలో సైతం రెండో బ్రాంచిని ఏర్పాటుచేశాడు. ఈ ఓపెనింగ్‌కు ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఇందులో స్పెషాలిటీ ఏం లేదు కానీ.. హైపర్‌ ఆది ఈ కార్యక్రమానికి రావడమే చర్చనీయంశమైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆర్పీ- ఆది మధ్య టర్మ్స్‌ అంతగా బాగోలేవు. కాని రీసెంట్‌గా ఆర్పీ చేప‌ల పులుసు క‌ర్రీ పాయింట్ లో ప్ర‌త్య‌క్షం కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Kirak RP said he will open fish curry outlet in america also
Kirak RP

అయితే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కిరాక్ ఆర్పీ ఓ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలో యాంక‌ర్ మాట్లాడుతూ.. మీ స్నేహితుడు అదిరే అభి ఓవర్సిస్ లో కూడా మీరు చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది..”కచ్చితంగా అమెరికాలో ఆర్పీ చేపల పులుసు పెడతాను. కొద్దిగా అనుభవం, మ్యాన్ పవర్ పెరిగాక అక్కడి తెలుగు వారికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూపిస్తాను. త్వరలోనే అన్ని విషయాలు చెప్తాను” అని పేర్కొన్నాడు ఆర్పీ. కాగా, కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష అని ఇటీవ‌ల రాకింగ్ రాకేష్‌ చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment