Goddess Lakshmi : ఎంత‌టి ద‌రిద్రాన్ని అయినా స‌రే పార‌ద్రోలే దారిద్ర్య నాశ‌న‌ మంత్రం.. 27 రోజుల పాటు ప‌ఠించాలి..

February 9, 2023 9:09 PM

Goddess Lakshmi : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు సంపాదించ‌డం కోసం అనేక మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే కొంద‌రు ఎంత కష్ట ప‌డినా డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇంకొంద‌రు డ‌బ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిల‌వ‌డం లేద‌ని వృథాగా ఖ‌ర్చు అవుతుంద‌ని విచారిస్తుంటారు. అయితే వారంద‌రూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ ప‌ఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి. సంప‌ద క‌లుగుతుంది. ధ‌నం చేతిలో నిల‌బ‌డుతుంది. ఇక ఆ మంత్రం ఏమిటంటే..

ఓం హ్రీం త్రిభువ‌న పాలిన్యై మ‌హాల‌క్ష్మై, అస్మాకం దారిద్ర్యం నాశ‌య నాశ‌య‌, ప్రచురం ధ‌నం మే దేహి దేహి, క్లీం హ్రీం శ్రీం ఓం.

read this mantra for 27 days to get Goddess Lakshmi blessings
Goddess Lakshmi

పైన తెలిపిన మంత్రాన్ని 27 రోజుల పాటు రోజూ ప‌ఠించాలి. అయితే మొద‌టి రోజు 1008 సార్లు చ‌ద‌వాలి. రెండో రోజు నుంచి రోజుకు 108 సార్ల చొప్పున ఈ మంత్రాన్ని ప‌ఠించాలి. ఇక ఏకాస‌నంలో ఈ మంత్రాన్ని ప‌ఠిస్తూ జ‌పం చేయాలి. ఇలా 27 రోజుల పాటు చేస్తే గుణం చూపిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మంత్రాన్ని ఎవ‌రైనా స‌రే అత్యంత నిష్టతో, న‌మ్మ‌కంతో ప‌ఠించాలి. న‌మ్మ‌కం లేకుండా ఎలాంటి పూజ చేసినా.. మంత్రం ప‌ఠించినా వృథా. క‌నుక దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మంత్రాన్ని ప‌ఠించాల్సి ఉంటుంది. అప్పుడు ధ‌న ల‌క్ష్మి అనుగ్ర‌హం క‌లుగుతుంది. సంప‌ద బాగా క‌ల‌సి వ‌స్తుంది. దారిద్ర్యం పోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now