NTR30 : ఎన్‌టీఆర్ 30 సినిమా క‌థ ఇదే..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

February 8, 2023 9:42 PM

NTR30 : జ‌న‌తా గ్యారేజ్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమా విష‌యంలో ఎన్టీఆర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఈ మూవీ విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు. కచ్చితంగా ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. త‌న 30వ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిన్న చిన్న లూప్స్ కి కూడా అవకాశం ఇవ్వకుండా తారక్ కొరటాలతో పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

ఒక కల్పిత ఐలాండ్ లో కథ నడుస్తుంద‌ని తెలుస్తుండ‌గా, సీపోర్ట్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉంటుందట. సెమీ పీరియాడిక్ కథ అట. మదర్ నేచర్ వంటి సామాజిక కోణాన్ని కూడా జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నారట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని టాక్. భాగ్య నగరంలో కొంత… ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.

NTR30 story have you know this
NTR30

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా సరికొత్త ప్రపంచాన్ని ఈ మూవీ కోసం కొరటాల సృష్టించినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేదంటే మార్చి 21, 25లలో చేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అప్డేట్స్… అప్డేట్స్ అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్ పీకిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. యాంకర్ సుమ కనకాల అప్డేట్ అడిగినప్పుడు ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు కూడా. భారతీయ ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనీస్ భాషల్లో కూడా విడుదల చేస్తారట. దాదాపు 9 భాషల్లో ఎన్టీఆర్ 30 విడుదల కానుందని సమాచారం. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల అవుతుందని ఇటీవ‌ల ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now