Waltair Veerayya : వాల్తేరు వీర‌య్య ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్ప‌టి నుండి అంటే..?

February 8, 2023 12:18 PM

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్టర్ మూవీ వాల్తేరు వీర‌య్య థియేట‌ర్స్ లో ఎంత సంద‌డి చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మెగాస్టార్‌ కంబ్యాక్ మూవీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో సంక్రాంతి వేదికైంది. చిత్రంలో వింటేజ్‌ చిరును చూసి అభిమానులు మురిపోయారు. మెగాస్టార్‌ యాక్షన్, కిక్కిచ్చే డ్యాన్సులు, విజిల్స్‌ వేయించే ఫైట్స్‌ ఇలా సినిమా మొత్తం ఒక మాస్‌ ప్యాకేజితో నిండిపోయింది. చిరు మాస్‌ యాక్షన్‌కు రవితేజ క్రేజ్‌ తోడవడంతో బాక్సాఫీస్‌ దగ్గర వాల్తేరు వీరయ్య విజయభేరి మొగించింది అని చెప్పాలి.

ప్ర‌స్తుతం స్ట‌డీగా క‌లెక్ష‌న్స్ కొన‌సాగుతున్నాయి. వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దాదాపు అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.

Waltair Veerayya to stream on netflix from this date
Waltair Veerayya

ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు చూస్తే సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. వాల్తేరు వీర‌య్య‌ సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్‌ను ఇప్పటి వరకు అందుకుంది.. రీసెంట్ గా ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఫిబ్రవరి 27 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఈ నెల 27 నుండి ఓటీటీలో ర‌చ్చ షురూ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment