మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్న బాల‌య్య‌.. వాళ్ల‌ని అలా అన్నాడుగా..!

February 5, 2023 4:54 PM

నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవలి కాలంలో వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల ముందు దేవ బ్రాహ్మణుల విషయంలోనూ ఆయన మాట్లాడిన మాటలు కాంట్రవర్సీగా మారాయి. తర్వాత ఎ.ఎన్.ఆర్ విషయంలో అక్కినేని తొక్కినేని అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ కావ‌డంతో స‌మ‌ర్ధించుకున్నారు. ఇక తాజాగా మ‌రోసారి బాల‌య‌య నోరు జారాడు. ఆయ‌న మాట‌లపై ఫ్యాన్స్ అభ్యంతరాన్ని వ్య‌క్తం చేశారు. ఇప్పుడు న‌ర్సులపై బాల‌య్య కామెంట్స్‌ని న‌ర్సుల సంఘం త‌ప్పు ప‌డుతుంది.

బాల‌కృష్ణ సినిమాల‌తో పాటు అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్న విష‌యం తెలిసిందే. . రీసెంట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చిన అన్‌స్టాపబుల్ 2 లో నర్సులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేఖత చోటు చేసుకుంది. ప‌వ‌న్ తో జ‌రిగిన చ‌ర్చ‌లో త‌నకు యాక్సిడెంట్ జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వివ‌రిస్తున్న సందర్భంలో న‌ర్సు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని న‌ర్సుల సంఘం డిమాండ్ చేసింది. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చ‌రిస్తున్నారు.

balakrishna yet again in another controversy nursed demand apology

ఇక బాల‌య్య వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న చేసిన అఖండ‌, వీర‌సింహారెడ్డి మంచి విజ‌యాన్ని సాధించాయి. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎపిసోడ్ కూడా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్న యాజమాన్యం ఇప్పటికీ భారీ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, బాలయ్య టాక్ షో చూస్తూ బుల్లితెర ఆడియన్స్ ఖుషీ అవుతున్నారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడుతూనే వారి వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలపై ఎన్నో సంగతులు బయటకు తీసుకువ‌స్తున్నారు బాల‌య్య‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now