నెటిజ‌న్ల‌కు మ‌ళ్లీ దొరికిపోయిన అనసూయ‌.. తెగ ట్రోల్ చేస్తున్నారుగా..

February 4, 2023 7:40 PM

అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అన‌సూయ ఆ త‌ర్వాత టీవీ షోస్, సినిమాల‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. ఇక‌ సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్క‌ర్లేదు. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త స్టైల్ వేరు.. సినిమాల‌లో మంచి బ‌ల‌మైన పాత్రలు పోషిస్తూ తెగ అల‌రిస్తుంది అన‌సూయ‌.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ వీలుకుదిరినప్పుడల్లా నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది.. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది అనసూయ. అయితే నెగెటివ్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అనసూయ.. తాజాగా అదే కోణంలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది . సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేయడంపై తాజాగా అనసూయ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ చిత్ర ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ పెట్టింది అనసూయ.

anasuya comments on negative characters netizen troll her

షారుఖ్ మాట్లాడుతూ.. డర్, బాజీగర్ చిత్రాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా చాలా నెగిటివ్ రోల్స్ చేశాడు. కాబట్టి మేమంతా చెడ్డవాళ్ళం అని కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఆ పాత్రలు పోషిస్తాం అని షారుఖ్ అన్నారు. షారుఖ్ కామెంట్స్ ని అనసూయ పోస్ట్ చేసింది. నేను మొదటి నుంచి మొత్తుకుంటోంది అదే. మేము నెగెటివ్ క్యారెక్ట‌ర్స్ చేస్తాం. నిజ జీవితంలో మా క్యారెక్టర్ అలా ఉండదు. సినిమాలని బట్టి మా క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లో కూడా ఊహించుకోవద్దు అని అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం అన‌సూయ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now