వార్నీ.. జీన్స్ ప్యాంట్‌ను ఇలా కూడా వేసుకోవ‌చ్చా.. వైర‌ల్ అవుతున్న వీడియో..

February 3, 2023 9:19 PM

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫీ జావెద్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యిన ఉర్ఫీ… షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి బీబీ ఓటీటీకంటెస్టెంట్ . హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపిస్తూ ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించుకుంది ఉర్ఫీ.

‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా ప‌లు పాత్ర‌ల‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.సినిమాలు, షోస్ క‌న్నా ఆమె డ్రెస్‌ల‌తోనే బాగా పాపుల‌ర్ అయింది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి. ఆమె దుస్తుల విషయంలో నెటిజ‌న్స్ ఘోరంగా ట్రోల్ చేస్తుంటారు , అయిన‌ప్ప‌టికీ బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.

urfi javed latest jeans dress video viral

తాజాగా ఆమె మరో కొత్త అవతారంలో కనిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఉర్ఫీ. డెనిమ్ జీన్స్ ఫ్యాంట్ ను టాప్‌గా ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. తన జీన్స్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చి.. దాన్ని టాప్‌గా మలచి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. ఆ డ్రెస్‌తొ జూహులోని ఓ రెస్టారెంట్‌కు రావడంతో.. కెమెరాలకు పని చెప్పినట్లయింది. ప్ర‌స్తుతం ఉర్ఫీ జావెద్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఉర్ఫీ ఇటీవ‌ల తనకు ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.ముస్లీం గృహ యజమానులు తన వస్త్రధారణ చూసి ఇల్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని, ఇదే సమయంలో హిందూ ఓన‌ర్లు తన మతాన్ని చూసి కిరాయికి ఇల్లు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment