Aryan Khan : ఇంత పొగరు ప‌నికిరాదు అంటూ షారూఖ్ త‌న‌యున్ని తిట్టి పోస్తున్న‌నెటిజ‌న్స్

February 3, 2023 10:25 PM

Aryan Khan : కార్డేలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ కేసులో ఉండడంతో దేశమంతా ఒక్కసారిగా కంగుతింది. ఆర్యన్ ఖాన్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే, సరైన ఆధారాల్లేని కారణంగా మే 28న అతడికి ఆ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది.అయితే ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుండి ఆర్య‌న్ ఖాన్ పెద్ద‌గా బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. క‌నిపించిన కూడా మీడియాకి మాత్రం చాలా దూరంగా ఉంటున్నాడు. అయితే మీడియాని ఇగ్నోర్ చేసిన వారు దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఆర్య‌న్ ఖాన్ చేసిన ప‌నికి తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు . ఈయన ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ ఈయన మాత్రం బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా ఈయన ఓ కార్యక్రమంలో భాగంగా బయటకు వచ్చారు. అయితే మీడియా వాళ్ళు తనని ఒక్క ఫోటో అని అడిగినప్పటికీ తను మాత్రం మీడియాని ఏమాత్రం పట్టించుకోకుండా కొంత యాటిట్యూడ్ చూపించారు. కారు ఎక్కి వెళ్తుండగా.. ‘ఆర్యన్ సార్ మీరు మమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు’ అని విలేఖరి అంటే యాటిట్యూడ్ చూపిస్తూ.. కారు ఎక్కి.. కాలు పైకి ఎత్తి.. ‘ఇది నేను’ అన్నట్టు ఒక వింత ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చాడు.

Aryan Khan being trolled by netizen what happened
Aryan Khan

ఈ వీడియో చూసి సోషల్ మీడియాలోని నెటిజ‌న్స్ ఆర్యన్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంత యాటిట్యూడ్ పనికిరాదబ్బా.. మీ నాన్నని చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్య‌న్ తండ్రి షారూఖ్ ఖాన్ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. కాగా షారూఖ్ ఖాన్ రీసెంట్‌గా ‘పఠాన్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment