స‌మంత ఎంత ప‌ని చేసింది.. చైతూకి సంబంధించిన ఆ తీపి గుర్తు కూడా చెరిపేసింది..!

February 4, 2023 11:03 AM

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో ఒకరిగా ఉన్న నాగ చైత‌న్య , స‌మంత 2017లో వివాహం చేసుకొని నాలుగేళ్ల త‌ర్వాత ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేశావే’ సినిమాలో కలిసి నటించి.. ఆ ప్రేమకథ సినిమాతోనే ప్రేమలో పడిన జంట నాగ చైతన్య, సమంత. ఆ తర్వాత చాలాకాలం ప్రేమలో ఉన్న త‌ర్వాత వివాహం చేసుకున్నారు.. హిందు, క్రైస్తవ పద్ధతిలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్ద‌రు టాలీవుడ్‌లో మోస్ట్ లవ్లీ కపుల్స్‌గా వీళ్లు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా మంచి బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, దీని త‌ర్వాతనే ఎందుకో వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయారు.

విడాకుల తర్వాత సమంత నాగ చైత‌న్య కు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు త‌న దగ్గర ఉండకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను కూడా డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చినప్ప‌టి నుండే ఆయ‌న‌కు సంబంధించిన వ‌స్తువుల‌ని ఒక్కొక్క‌టిగా పంపించింది స‌మంత‌. ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న పెళ్లి చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం విశేషం. ఆ చీరను కూడా సమంత పంపించేసింద‌ని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి.

samantha erased last memory of naga chaitanya

స‌మంత‌… చైతూకి గుర్తుగా ప‌లు టాటూలు వేయించుకుంది. అవి మాత్రం చెరుపుకోలేక‌పోయింది. మొదటగా తాను చైతుని కలిసిన ‘ఏం మాయ చేశావే’ సినిమాకు గుర్తుగా వీపుపై ‘వైఎంసీ’ అనే టాటూ వేయుంచుకుంది. అంతేకాక ఆమె కుడి చేయి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. అదే టాటూ చైకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రైట్ రిబ్‌పై ‘చై’ అనే టాటూ కూడా వేయించుకుంది.ఇవి అలానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now