Brahmanandam : బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

February 3, 2023 8:25 AM

Brahmanandam : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కామెడీకి కేరాఫ్‌గా నిలిచారు బ్ర‌హ్మానందం. తన హాస్యంతో తెలుగువారిని ఎంత‌గానో అలరించిన బ్రహ్మి రీసెంట్‌గా 67వ పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. ఈ క్రమంలో ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి త‌ప్ప‌నిస‌రి. స్టార్ హీరోల సినిమాలోను బ్ర‌హ్మానందం త‌ప్ప‌నిస‌రి ఉండాల్సిందే. అయితే వయసు పై పడటంతో ఇపుడు సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బ్రహ్మానందం మొదట తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహించేవాడు.ఆ తర్వాత సినిమా అవకాశాలు రావటంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.ముఖ్యంగా ఆహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం కామెడీ అతినికి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత నుండి బ్రహ్మానందంకి కామెడీ పాత్రలకు వరుస ఆఫర్లు దక్కాయి. ఒకానొక దశలో ఏడాది మొత్తం విడుదలైన ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం కామెడీ ఉండేది.అంతలా ఈయన కామెడీకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు.. కొన్నాళ్లుగా సినిమాల్లో బ్యాడ్ టైం ఎదుర్కొంటున్నారు బ్రహ్మానందం.

Brahmanandam total net worth properties and assets value
Brahmanandam

ఆయన స్థాయికి తగిన పాత్రలు పెద్ద‌గా పడడం లేదు. అదీ గాక వెన్నెల కిషోర్, సప్తగిరి, శకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి యువ కమెడియన్ల ఎంట్రీతో హాస్యబ్రహ్మకి కాస్త అవకాశాలు తగ్గాయి అనే చెప్పాలి.కెరీర్‌లో దాదాపు 1200కి పైగా సినిమాలు చేసిన బ్ర‌హ్మానందం ఒక్కో కాల్ షీట్ కి దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడు. తన పారితోషికాన్ని సగం భూములపై ఇన్వెస్ట్ చేశారు.ఇలా ఆయన పొదుపు చేసిన స్థిర, చరాస్థులు అన్ని కలిపితే.దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ టాక్ . డబ్బు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరంచిడంతో పాటు మరే దురలవాట్లు లేని కారణంగా బ్రహ్మానందం వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు అని చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now