Lalitha Jewellers : రోజాతో మాకు ఉన్న అనుబంధం ఎంతో గొప్ప‌ది.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన ల‌లిత జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్‌..

February 2, 2023 2:04 PM

Lalitha Jewellers : ల‌లిత జ్యువెల‌రీ ఓన‌ర్ కిర‌ణ్ కుమార్‌ని చూస్తే డ‌బ్బులు ఊరికే రావు అనే డైలాగ్ వెంట‌నే గుర్తుకు వ‌స్తుంది. ఎలాంటి సెలబ్రిటీ సాయం తీసుకోకుండా త‌న కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ వ‌స్తున్నాడు కిర‌ణ్ కుమార్. చిత్తూరు నగరంలోని వేలూరు రోడ్డు చామంతి పురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లలిత జ్యువలరీ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.

సినీ ప‌రిశ్ర‌మ చెన్నైలో ఉన్న‌ప్పుడు అప్పుడు లలిత జ్యువెలరీ లోనే నగలు కొనుగోలు చేసే వారిని, అధినేత కిరణ్ కుమార్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన నగలను అందించే వారని రోజా తెలిపారు. ఇప్పటిదాకా 45 బ్రాంచీలను ఓపెన్ చేసి.. జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడదే వ్యక్తి తాజాగా చిత్తూరులో 46వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. రోజాతో రిబ్బ‌న్ క‌ట్ చేయించి కొత్త షోరూం ఓపెన్ చేసిన కిర్‌ణ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చినందుకు రోజా గారికి థ్యాంక్స్. రీసెంట్ గా మా టీంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఓపెనింగ్ కి రావాలని ఆహ్వానించాం . ఆ స‌మ‌యంలో మాకు భోజనం పెట్టి మరీ మాకు మర్యాదలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న గెస్ట్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది” అంటూ రోజాని కొనియాడాడు.

Lalitha Jewellers MD interesting comments on Roja
Lalitha Jewellers

గ్రీన్ అంబాసిడర్ గా రోజాను నియమిస్తారా అని కిరణ్ కుమార్ ను విలేకరులు అడగ‌గా, ఆ ప్ర‌శ్న‌కు రోజా స్పందిస్తూ కిరణ్ కుమార్ ఒక అంబాసిడర్ అని ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్ తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయింది అన్నారు.అనంతరం లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోదరి సమానురాలైన రోజాతో తనకున్న అనుబంధం గొప్పదని, పిలవగానే ప్రారంభానికి వచ్చిన రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రోజాపై ప్రశంస‌లు కురిపిస్తూ లలితా జ్యువలరీ ఓనర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now