Keerthy Suresh : చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి..? శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న నెటిజ‌న్స్..

February 2, 2023 3:57 PM

Keerthy Suresh : చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించే నటన, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. మ‌హాన‌టి చిత్రంతో క్రేజ్ పొందిన ఈ అందాల ముద్దుగుమ్మ సౌత్ ఇండియా మొత్తం హవాను చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ పెళ్లి వార్త బాగా హైలైట్ అవుతోంది. ఇటీవ‌ల‌ కీర్తి సురేష్‌ తన చిన్ననాటి మిత్రుడితో గత పదేళ్లుగా ప్రేమలో ఉందని, అతనికి కేరళలో పలు వ్యాపారాలున్నాయని వార్తలొచ్చాయి. ఈ ఏడాదిలోనే తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి కీర్తి సురేష్‌ పెళ్లిపీటలెక్కనుందని ప్రచారం జరిగింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్‌ స్పందించింది.

కీర్తి సురేష్ స్పందిస్తూ.. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, సినిమాల్లో మరి కొన్నేళ్లు కొనసాగాలన్నది తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, ఒకవేళ పెళ్లి కుదిరితే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘దసరా’ చిత్రంతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్‌’లో సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో నటిస్తున్నది.కీర్తి సురేష్ విష‌యానికి వ‌స్తే.. చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో ‘గీతాంజలి’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి మెప్పించింది.

Keerthy Suresh reportedly getting married
Keerthy Suresh

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘నేను శైలజ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ‘నేను శైలజ’ తర్వాత తెలుగులో కీర్తి సురేష్ వరుస సినిమాలతో సందడి చేయ‌గా, అదే క్ర‌మంలో బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా సొంతమైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now