బీరుతో మంటలను ఆర్పిన మందు బాబు.. అతని తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

June 24, 2021 8:10 PM

సాధారణంగా మనం ఎక్కడైనా మంటలు వ్యాపిస్తే వెంటనే నీటి కోసం వెతికి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తాము. మరికొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేస్తారు.అదేవిధంగా మరికొందరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ మాత్రం కంగారు పడకుండా తన తెలివితేటలతో ఎంతో చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. అచ్చం ఈ మందు బాబు కూడా సమస్యను అలాగే పరిష్కరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బవేరియాలోని హెస్బాచ్ పట్టణంలో నివసిస్తున్న ఓ వ్యక్తి బీరు బాటిళ్లును కొనుగోలు  చేశాడు. మార్గమధ్యంలో అతనికి కార్ ఇంజన్ వేడెక్కడంతో ఉన్నపళంగా కారులో మంటలు వ్యాపించాయి. అయితే ఈ విధంగా మంటలు వ్యాపించడంతో అతను ఏమాత్రం కంగారు పడకుండా తన కారులో ఉన్నటువంటి బీర్ బాటిల్ ద్వారా మంటలను అదుపు చేశాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునిలోపు సమస్యను పరిష్కరించారు. బీరు పోయడం వల్ల మంటలు అధికమౌతాయి అనే సందేహం మీకు కలగొచ్చు..

సాధారణంగా ఏదైనా మంటలు వ్యాపించినప్పుడు ఆల్కహాల్ వేస్తే మంటలు అధికమవుతాయి. కానీ బీరు లో 90 శాతం నీరు ఉండటం వల్ల దీనికి మంటలను అదుపుచేసే గుణం ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి తన కారులో వ్యాపించిన మంటలను అదుపు చేయడానికి బీరును ఉపయోగించాడని తెలియడంతో అతనిపై నెటిజన్లు ఏం తెలివి గురూ మీది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now