Divyansha Kaushik : ఆ హీరోయిన్‌తో నాగ‌చైత‌న్య పెళ్లి ఖాయ‌మా.. క్లారిటీ ఇచ్చేశారుగా..!

January 30, 2023 8:33 AM

Divyansha Kaushik : అక్కినేని నాగేశ్వ‌ర్ రావు న‌ట సామ్రాట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటే.. ఆయ‌న త‌రువాత నాగార్జున యువ సామ్రాట్ అయ్యారు. నాగార్జున‌కు కూడా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది. అయితే నాగార్జున త‌రువాత ఆయ‌న కుమారులు నాగ‌చైత‌న్య‌, అఖిల్‌.. మొద‌ట్లో అంత‌గా స‌క్సెస్ కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుని విజయాల బాట‌లో న‌డుస్తున్నారు. ఇక నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం స్టార్ హీరోల లిస్ట్‌లోనూ చేరిపోయాడు. చైతూ త‌ను ప్రేమించిన స‌మంత‌ను గ‌తంలో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల ప్రేమ అనంత‌రం పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఇద్ద‌రూ అనుకోకుండా విడిపోయారు. త‌రువాత ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే నాగ‌చైత‌న్యను మొద‌ట్లో జెంటిల్‌మ‌న్ అనే వారు. కానీ ఇప్పుడు మ‌న్మ‌థుడు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మ‌ళ్లీ సింగిల్ గానే ఉంటున్నాడుగా.. అందుక‌ని..

ఇక నాగ‌చైత‌న్య ఫ‌లానా హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడు.. అని ఇప్ప‌టికే అనేక సార్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఇలాంటి వార్త‌లే వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజుల కింద‌ట రాశీఖ‌న్నాతో అత‌ను ప్రేమ‌లో ఉన్నాడ‌ని, అలాగే సాయి ప‌ల్ల‌వి అని గుస‌గుస‌లు వినిపించాయి. త‌రువాత శోభిత ధూళిపాళ అన్నారు. ఇక ఇప్పుడు ఇంకో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ హీరోయిన్‌తో చైతూ బాగా క్లోజ్‌గా ఉంటున్నాడ‌ని.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెనే.. దివ్యాంశ కౌశిక్‌. మ‌జిలీలో చైతూ ప‌క్క‌న చేసింది. అయితే ఆమెకు ఆ ఆఫ‌ర్‌ను చైత‌న్య‌నే ఇప్పించాడ‌ని తెలుస్తోంది.

Divyansha Kaushik marriage with nagachaitanya clarity given
Divyansha Kaushik

కాగా ఆ వార్తలపై ఇటీవ‌ల‌ దివ్యాంశ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఐ లవ్ నాగచైతన్య, అతని పై క్రష్ ఉంది. చుడ్డానికి బాగుంటాడని చెప్పింది. అలా అని మా మధ్య ఏదో ఉందని అనుకుంటే పొరపాటు.. మా మధ్య అలాంటిది ఏమీ లేదని స్ప‌ష్టం చేసింది. మేం పెళ్లి చేసుకుంటాం అని వచ్చిన వార్తలు కేవ‌లం పుకార్లు మాత్ర‌మే అని తెలియ‌జేసింది. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని.. వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు ఇంకా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now