Betel Leaves : త‌మ‌ల‌పాకుల‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

December 11, 2022 4:38 PM

Betel Leaves : మన దేశంలో తమలపాకుల‌ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అన్ని వేడుకలలోనూ తమలపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది. తమలపాకుల‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తమలపాకుల‌లో విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, విటమిన్స్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తమలపాకుల‌ను పేస్టుగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే తమలపాకుల‌ రసం తాగితే శరీరం లోపల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుకడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. తమలపాకుల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా ప్ర‌భావ‌వంతంగా పని చేస్తుంది. ఈ ఆకుల‌ను తింటే శరీరంలోని విషాలు బయటకు పోతాయి. అలాగే తమలపాకు ఆకలి హార్మోన్లను పునరుద్ధరిస్తుంది. ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా చేస్తుంది. నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

Betel Leaves benefits must take them
Betel Leaves

తమలపాకుల‌లో యాంటీ బయోటిక్ ప్రభావాలు ఉండడం వల్ల దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే త్వ‌రగా ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీకు కుదిరిన సమయంలో లేత తమలపాకు ఒకటి తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now