Guava Leaves Tea : జామ ఆకుల‌తో చేసిన టీని రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..

November 30, 2022 9:12 PM

Guava Leaves Tea : జామకాయలే కాదు.. జామ ఆకులతో కూడా చాలా పోషకాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. శరీరానికి కావలసిన పోషకాలు అందాలంటే రోజూ ఉదయం జామ ఆకుల టీ తాగాలని వెల్లడిస్తున్నారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. మీరు జామ టీ అసలు వదిలిపెట్టరు అంటున్నారు నిపుణులు. పుష్కలమైన పోషకాహార ఘని కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా అభివర్ణించారు. జామలో 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లుతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

ప్రతి చిన్న సమస్యకి మనము మందులు వేసుకోకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనకు అందించింది. డెంగ్యూ అనగానే మనము చాలా భయపడుతుంటారు. ఎందుకంటే డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి జామ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. 10 జామ ఆకులను తీసుకొని మూడు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించి అవి ఒక కప్పు నీరు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి ఆ నీటిని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తాగిస్తే  ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇలా రోజుకి మూడు కప్పులు ఇవ్వాలి. జామ ఆకులతో టీ తయారుచేసుకొని తాగితే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Guava Leaves Tea must take daily know the benefits
Guava Leaves Tea

జామ ఆకులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి. అంతేకాకుండా జామ ఆకుల టీ యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది. అలాగే జామ ఆకుల టీ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామలో ఉండే లైకోపీన్ అనే పదార్థం ఒక యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది.

జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. జామకాయ మొత్తం ఫైబర్​తో నిండి ఉంటుంది. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతుంది అని అనేక పరిశోధనలో వెళ్లడయింది. దగ్గు జలుబు అధికంగా ఉన్నవారు జామాకులని ఇలా టీ చేసుకుని తాగడం వల్ల కఫదోషం అనేది తగ్గుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now