Belly Fat : శరీరం మొత్తంలో కొవ్వు కరిగించడానికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది..!

December 1, 2022 10:21 AM

Belly Fat : ప్రస్తుత తరుణంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడతారు కానీ ఫలితం కనిపించదు. అలాంటి వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.  శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది. ఒకటి వ్యాయామం చేసినప్పుడు, మరొకటి కంటి నిండా నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా భోజనం చేయకూడదు. అలాగే నిద్ర పోయే ముందుగా కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఎవరైతే నిద్ర పోవడానికి రెండు నుంచి మూడు గంటలు ముందు భోజనం చేస్తారో అలాంటి వారి శరీరంపై బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా  వేగంగా అద్భుతంగా పనిచేస్తాయి. దీని వలన ఒక సాధారణమైన వ్యక్తి 800 గ్రాముల నుండి ఒక కిలో బరువు వరకు నిద్రలోనే చాలా సులభంగా తగ్గుతారు. ఏ వ్యాయామం లేకుండా నిద్రలోనే బరువు  తగ్గించాలి అనుకుంటే ఈ ఒక చిట్కా ఉపయోగిస్తే చాలు . ఈ చిట్కా కొరకు మీరు ఇప్పుడు చెప్పబోయే పౌడర్ ని తయారు చేసుకొని భద్రపరచుకోవాలి. మరి పౌడర్ తయారీ విధానం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Belly Fat remedies works wonderfully try once
Belly Fat

బరువు తగ్గడానికి ఉపయోగించే ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు ఏమిటంటే.. సోంపు 50 గ్రాములు, ½ టీ స్పూన్ పసుపు, అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) 25 గ్రాములు, జీలకర్ర 25 గ్రాములు, కరివేపాకు పొడి 25 గ్రాములు, కరక్కాయ 25 గ్రాములు (కరక్కాయ పౌడర్ దొరకకపోతే త్రిఫల చూర్ణం కూడా వాడుకోవచ్చు.) ½ టీ స్పూన్ సైంధవ లవణం, ఇంగువ 2 చిటికెలు.

ముందుగా అవిసె గింజలు, సోంపు, జీలకర్రను స్టవ్  లో ఫ్లేమ్ పై పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు మిశ్రమాలను చల్లబడిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పౌడర్ లోకి 25 గ్రాముల కరక్కాయ పౌడర్, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సైంధవలవణం వేసుకోవాలి. సైంధవ లవణం లేకపోతే నల్ల ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో రెండు చిటికెలు ఇంగువ, 25 గ్రాములు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ పొడిని భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్ర పోయే ఒక గంట ముందు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి. మీకు దీని ఫలితాలు ఇంక తొందరగా కావాలి అనుకుంటే కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. కానీ దీన్ని ప్రతిసారి కేవలం ఒక్కసారి పావు టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకుని తాగాలి. అంతకు మించి ఎక్కువగా కలుపుకుని తాగకూడదు.

ఈ పౌడర్ మన పొట్ట చుట్టూ మరియు మిగతా శరీర భాగాలలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పొడిలో అవిసె గింజలు వాడడం వలన ఇందులో  ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది  జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఎవరైతే మలబద్దక సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రోజు అవిసె గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి సహాయంతో తీపి మరియు ఎక్కువగా ఫై చేసిన ఆహారపదార్థాలు సులభంగా కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now