Headache : ఎలాంటి త‌ల‌నొప్పి అయినా స‌రే.. క్ష‌ణాల్లో మాయం అవుతుంది.. ఇలా చేయాలి..

November 25, 2022 6:42 PM

Headache : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అధిక పని, ఒత్తిడి లేదా ఇతర పరిస్థితుల వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే ప్రతి తలనొప్పిని నార్మల్‌గా పరిగణించడం అంత మంచి విషయం కాదు. కొన్ని రకాల తలనొప్పి కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకం సమస్య. దీనితో ప్రజలు వికారం, వాంతులు, కాంతి మరియు ధ్వనికి సున్నితత్వం వంటి కొన్ని ఇతర లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పిని కలిగి ఉంటారు.

2018 అధ్యయనంలో యునైటెడ్ స్టేట్స్‌లో 15 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు మైగ్రేన్‌లతో బాధపడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అదే సమయంలో, 2015 లో 19 శాతం మంది స్త్రీలు మరియు 9 శాతం మంది పురుషులు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని కనుగొనబడింది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఈ సమస్య ఉండవచ్చు. మైగ్రేన్ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మామూలు తలనొప్పిని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ మైగ్రేన్ తలనొప్పి వస్తుంటే మాత్రం దాన్ని మొదట్లోనే కంట్రోల్ చెయ్యాలి.

follow this wonderful remedy for any type of Headache
Headache

మన భారతీయ ఆయుర్వేద పద్ధతిలో మైగ్రేన్ తగ్గించే ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మరి మైగ్రేన్ ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో అర టీ స్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సున్నం కలపాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోండి. మీకు తల నొప్పిగా అనిపించినప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మీకు తలనొప్పి కలిగించే ప్రదేశంలో లేదా మీ ముదురు కనతలపైన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని అప్లై చేసి ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి.ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కేవలం ఐదు నుండి పది నిమిషాలలోపు మీ తలనొప్పి తగ్గటం మీరే గమనిస్తారు. ఒకవేళ మీ తల నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచితే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now